హైదరాబాద్, వెలుగు:తెలంగాణ మహిళ విద్యావంతుల ఫోరం రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షురాలుగా డాక్టర్ స్వర్ణలత వద్దిరాజు, ప్రధాన కార్యదర్శిగా తలమల్ల శ్వేత హసేన్ ఎన్నికయ్యా రు. ట్రెజరర్‌గా ద్వాత్రిక స్వప్న, వైస్ ప్రెసిడెంట్‌గా నాగపురి రోజా, జాయింట్ సెక్రటరీగా డాక్టర్ రేష్మ నియమితులైనట్టు నేతలు తెలిపారు. డిసెంబర్ 20న చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీలో ఆవిర్భావ సభను నిర్వహిస్తామని జనరల్ సెక్రటరీ శ్వేత హసేన్ వెల్లడించారు. మహిళల హక్కుల కోసం పోరాడేందుకు ఈ ఫోరాన్ని ఎన్నుకున్నట్టు ఆమె చెప్పారు.